Monday, October 15, 2018

తప్పక నవ్వుతారు. :)

టీచర్ -- "భారత దేశం నుంచి 
             మొదటిసారిగా విదేశం
          వెళ్ళిన మహిళ ఎవరు?’’

విద్యార్ధి --"సీత టీచర్.
                శ్రీలంక వెళ్ళింది.’’

టీచరు ఇంకా కోమా లోంచి బయటకి రాలేదు..

*****
ఆ మేధావి విద్యార్థి పెరిగి, పెరిగి, పెద్ద లాయర్ అయ్యాడు....

ఒక జడ్జి గారు మన లాయర్ ని అడిగాడు :

"మహాభారతానికి , రామాయణానికి తేడా ఏమిటి?"

మన లాయర్....

"మహాభారతం భూమి తగాదా కేసు,
రామాయణం కిడ్నాప్ కేసు !"

జడ్జి గారు కోమాలోకి వెళ్లిపోయారు.....

> వాట్సప్ షేరింగ్ లో చూసి కామెడీగా ఉందని పోస్ట్ చేసా! ఎవరూ ఏమీ అనుకోమాకండి సుమా!! :)

Thursday, October 11, 2018

అసుర సంబంధులందరూ నరకవాసులే!

యధావిధిగా భగవద్గీత చదువుతూ ఉంటే అసలు అసురులంటే ఎవరు? అనే సందేహం కలిగింది. చిరంజీవిగారు వ్రాసిన సురులు,అసురులు అన్న టపాలో ఆయన దేవతలైన వరుణుడు,ఇంద్రుడు, అగ్ని..ఇలా అనేకమందిని ఋగ్వేదం అసురులుగా పేర్కొనడం వ్రాసుకొచ్చారు.

ఋగ్వేదం 8.42.1. ఈ విధంగా అంటుంది: 

अस्तभ्नाद दयामसुरो विश्ववेदा अमिमीत वरिमाणं पर्थिव्याः |
आसीदद विश्वा भुवनानि सम्राड विश्वेत तानि वरुणस्य वरतानि ||

 "అసురుడైనటువంటి వరుణుడు.. పరలోకము మొదలుకోని.. భూమివరకు.. లోకమును కొలిచాడు.. ఈ క్రమంలో.. అతడు అన్ని జీవులని కలిశాడు." 

ఋగ్వేదం 1.174.1 కూడా ఇంద్రుడు అసురుడనే చెబుతుంది.. ఋగ్వేదం యొక్క అనేక శ్లోకాలు... మిత్ర, వరుణ, సావిత్రి, అగ్నీ, పుషన్ వంటి వేద దేవుళ్ళను అసురులుగా చెబుతున్నాయి.

అయితే పై ఋగ్వేద మంత్రాలను ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉంది. నాకు పరిచయమున్న వేదం పండితులతో చర్చించవలసిన పరిస్థితి అంతకంటే ఎక్కువే ఉంది.

ఇకపోతే భగవద్గీతలో అసుర సంబంధమైన వారి గూర్చి క్రింది విధంగా ఉంది.
మచ్చుకు కొన్ని భగవద్గీత శ్లోకాలు.
తానహం ద్విషత: క్రూరా న్నంసారేషు నరాధమాన్
క్షిపామ్యజస్ర మశుభా నాసురీష్వేవ యోనిషు. {గీత 16:19}

తా:- నన్ను ద్వేషించువారును, క్రూరులును, అశుభ (పాప) కార్యములను జేయువారును నగు అట్టి మనుజాధములను నేను జననమరణరూపములగు ఈ సంసారమార్గములందు అసురసంబంధమైన నీచజన్మలందే యెల్లప్పుడు త్రోసివైచెదను.

ఆసురీం యోనిమాపన్నా మూడా జన్మని జన్మని
మామప్రాప్యైవ కౌన్తేయ! తతో యాన్త్యధమాం గతిమ్. [గీత 16:20]

తా:- ఓ అర్జునా! అసురసంబంధమైన (నీచ) జన్మమును పొందినవారలగు మూడులు ప్రతి జన్మయండును నన్ను పొందకయే, అంతకంటే (తాము పొందిన జన్మ కంటే) నీచతరమైన జన్మమును పొందుచున్నారు.

ఈవిధంగా భగవద్గీత అసురసంబంధమైన గుణములు కలవారందరూ నీచజన్ములు అని క్రూరులని, అశుభ కార్యములు చేయువారని చెప్పడమే కాకుండా 16వ అధ్యాయం 13 -16 శ్లోకాలలో అసురులు యొక్క గుణగణాలను తెలియజేస్తూ "పతన్తి నరకేzశుచౌ" అపవిత్రమైన నరకమందు పడుచున్నారంటూ తెలియజేస్తుంది.

Tuesday, October 09, 2018

రష్యాలోని మూడు వింత ప్రదేశాలు. | Three wonder places in Russia.

రష్యాలోని మూడు వింత ప్రదేశాలు. | Three wonder places in Russia.

ఇక్కడ మీకు 3 అద్భుతమైన, ఆశ్చర్యకరమైన వీడియోలను అందిస్తున్నాను. ఈ సంఘటనలు పాత రష్యా దేశంలోని వింతైన ప్రదేశాలలోని జరుగుతున్న వింత వింత విషయాలు.  ఒకటోది :- మనం తాగగలిగే మంచి నీరు, పెట్రోల్ లాగా మండటం. రెండోది :- భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఉండే ప్రదేశం, అక్కడకు ఏదైనా వస్తువును విసిరితే, అది తిరిగి వచ్చి మనముందుకు వచ్చి పడుతుంది. మూడవది :- ఒక కొలనులోని నీటిలో పెద్ద పెద్ద బరువైన రాళ్ళను వేసిన వెంటనే అవి దూది పింజలాగా పైకి తేలుతాయి. మీరే చూడండి..*_Monday, October 08, 2018

సీసిరో అనే తత్వవేత్త క్రీ.పూ.43 లో తెలిపిన అంచనాలే ఇప్పుడమలవుతున్నాయి

*1. పేదలు శ్రమ చేస్తూనే ఉంటారు.
*2. ధనికులు వారిని వాడుకుంటారు.
*3.సైనికుడు పై ఇద్దరినీ రక్షిస్తుంటాడు.
*4.పన్ను కట్టేవాడు, పై ముగ్గురుకీ కడుతుంటాడు.
*5.తిరుగుబోతు, పై నలుగురి బదులుగా విశ్రాంతి తీసుకుంటాడు.
*6.తాగుబోతు పై ఐదుగురి కోసం తాగుతుంటాడు.
*7. ధనాగార నిర్వాహకుడు పై ఆరుగురిని దోపిడి చేస్తుంటాడు.
*8. న్యాయవాది , పై ఏడుమందిని తప్పు త్రోవ పట్టిస్తుంటాడు .
*9. వైద్యుడు, పై ఎనిమిది మంది నుంచి డబ్బు తీసుకుంటాడు .
10. కాటికాపరి పై తొమ్మిది మందినీ పాతిపెడతాడు.
11. రాజకీయ నాయకుడు, పై వారందరి మూలంగా హాయిగా జీవిస్తాడు
 *ఈ నాటికీ ఇవే వర్తిస్తున్నాయి  క్రీ.పూ.43 నాటివి ! *

Friday, October 05, 2018

చదువూరించే బ్లాగులు కరువైపోయాయి.

reading-blogs-diluted

చదువూరించే బ్లాగులు కరువైపోయాయి.

అతి కొద్ది బ్లాగులు తప్ప ఇంట్రస్ట్ కలిగించే బ్లాగులు మాలికలో పెద్దగా కనిపించడం లేదు. పాతతరం వారి బ్లాగులు మళ్ళీ ఉనికిలోకి వస్తే బాగుణ్ణు. ఇంతకు ముందు మంచి,మంచి బ్లాగులు కనిపించేవి. హాస్య బ్లాగులు, కార్టూన్ బ్లాగులు, కథల బ్లాగులు, సాహిత్య,ఆధ్యాత్మిక.., ఇలా ఒకటేమిటి అనేక రకాల బ్లాగులు కలిపించేవి. ఇప్పుడవేవీ కనిపించడమే తగ్గిపోయింది. మాలికలో టపాల పేజీ కంటే "కామెంట్ల"పేజీకే విజిటింగ్ రేటు ఎక్కువనుకుంటా! ఎందుకంటే కొంతమంది అరకొర టపా వ్రాసినా తమతమ బ్లాగుల్లో కామెంట్లు పెట్టుకుని తరించడానికే ఇష్టపడుతున్నారు. నిజానికి వారు పెట్టుకుంటున్న ఆ కామెంట్లు వారు వ్రాసుకున్న టపాలకే సంబంధం ఉండదు. మళ్ళీ తెలుగు బ్లాగుల పూదోట వికసిస్తే బాగుణ్ణు.

Friday, September 28, 2018

గవర్నమెంట్ ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన FUNDAMENTAL RULES

గవర్నమెంట్ ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన  FUNDAMENTAL RULES

Fundamental Rules to be understood by Government employees
# F.R. 12(a)👉1 శాశ్వత పోస్ట్ లోకి ఇద్దరూ, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఒకే సారి నియమించరాదు.

#F. R. 12(బి)👉ఒక govt employee ని ఒకే సారి 2 లేక అంతకంటే ఎక్కువ పోస్ట్ లలో నియమించరాదు.

# F. R. 12(c)👉ఉద్యోగి లీవ్ లో ఉంటే ఆ పోస్ట్ లో మరొకరిని appoint చేయకూడదు.

#F. R. 15(b)👉 ఉద్యోగి 1 డే కూడా మెడికల్ లీవ్ పెట్టుకోవచ్చు.

#F. R. 18👉govt appoint చేస్తే తప్ప, ఏ employee కి ఒకే సారి 5y కంటే ఎక్కువ సెలవు మంజూరు చేయకూడదు.

#F. R.18(a)👉1y కంటే ఎక్కువ కాలం పర్మిషన్ లేని సెలవు లో ఉంటే, అతను రాజీనామా చేసినట్లు లెక్క.

#F.R.18(బి)👉పర్మిషన్ ఉన్నా /పర్మిషన్ లేకుండా 5y కంటే ఎక్కువ కాలం లీవ్ లో ఉంటే అతను జాబ్ కి రాజీనామా చేసినట్లు లెక్క.

Tuesday, September 18, 2018

కనువిందు చేసే అందమైన పువ్వులు | Beautiful flowers that are eye-catching

కనువిందు చేసే  అందమైన పువ్వులు | Beautiful flowers that are eye-catching

Beautiful flowers that are eye-catching

Beautiful flowers that are eye-catching

Beautiful flowers that are eye-catching

Beautiful flowers that are eye-catching


Beautiful flowers that are eye-catching

Beautiful flowers that are eye-catching
Related Posts Plugin for WordPress, Blogger...