గురువారం, అక్టోబర్ 11, 2018

యధావిధిగా భగవద్గీత చదువుతూ ఉంటే అసలు అసురులంటే ఎవరు? అనే సందేహం కలిగింది. చిరంజీవిగారు వ్రాసిన సురులు,అసురులు అన్న టపాలో ఆయన దేవతలైన వరుణుడు,ఇంద్రుడు, అగ్ని..ఇలా అనేకమందిని ఋగ్వేదం అసురులుగా పేర్కొనడం వ్రాసుకొచ్చారు.

ఋగ్వేదం 8.42.1. ఈ విధంగా అంటుంది: 

अस्तभ्नाद दयामसुरो विश्ववेदा अमिमीत वरिमाणं पर्थिव्याः |
आसीदद विश्वा भुवनानि सम्राड विश्वेत तानि वरुणस्य वरतानि ||

 "అసురుడైనటువంటి వరుణుడు.. పరలోకము మొదలుకోని.. భూమివరకు.. లోకమును కొలిచాడు.. ఈ క్రమంలో.. అతడు అన్ని జీవులని కలిశాడు." 

ఋగ్వేదం 1.174.1 కూడా ఇంద్రుడు అసురుడనే చెబుతుంది.. ఋగ్వేదం యొక్క అనేక శ్లోకాలు... మిత్ర, వరుణ, సావిత్రి, అగ్నీ, పుషన్ వంటి వేద దేవుళ్ళను అసురులుగా చెబుతున్నాయి.

అయితే పై ఋగ్వేద మంత్రాలను ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉంది. నాకు పరిచయమున్న వేదం పండితులతో చర్చించవలసిన పరిస్థితి అంతకంటే ఎక్కువే ఉంది.

ఇకపోతే భగవద్గీతలో అసుర సంబంధమైన వారి గూర్చి క్రింది విధంగా ఉంది.
మచ్చుకు కొన్ని భగవద్గీత శ్లోకాలు.
తానహం ద్విషత: క్రూరా న్నంసారేషు నరాధమాన్
క్షిపామ్యజస్ర మశుభా నాసురీష్వేవ యోనిషు. {గీత 16:19}

తా:- నన్ను ద్వేషించువారును, క్రూరులును, అశుభ (పాప) కార్యములను జేయువారును నగు అట్టి మనుజాధములను నేను జననమరణరూపములగు ఈ సంసారమార్గములందు అసురసంబంధమైన నీచజన్మలందే యెల్లప్పుడు త్రోసివైచెదను.

ఆసురీం యోనిమాపన్నా మూడా జన్మని జన్మని
మామప్రాప్యైవ కౌన్తేయ! తతో యాన్త్యధమాం గతిమ్. [గీత 16:20]

తా:- ఓ అర్జునా! అసురసంబంధమైన (నీచ) జన్మమును పొందినవారలగు మూడులు ప్రతి జన్మయండును నన్ను పొందకయే, అంతకంటే (తాము పొందిన జన్మ కంటే) నీచతరమైన జన్మమును పొందుచున్నారు.

ఈవిధంగా భగవద్గీత అసురసంబంధమైన గుణములు కలవారందరూ నీచజన్ములు అని క్రూరులని, అశుభ కార్యములు చేయువారని చెప్పడమే కాకుండా 16వ అధ్యాయం 13 -16 శ్లోకాలలో అసురులు యొక్క గుణగణాలను తెలియజేస్తూ "పతన్తి నరకేzశుచౌ" అపవిత్రమైన నరకమందు పడుచున్నారంటూ తెలియజేస్తుంది.

1 కామెంట్‌:

  1. మరి ఋగ్వేదం నుంచి భగవద్గీతకి వచ్చేసరికి, అసురుల అర్ధం ఎందుకు మారిపొయ్యిందంటారూ?

    రిప్లయితొలగించండి

 


Popular Posts

Recent Posts