శనివారం, అక్టోబర్ 28, 2017

ఈ హరిబాబు ఎవడో గాని ఈమధ్య ప్రతి విషయంలోనూ నా ప్రస్తావన తీసుకొస్తూ అతిదారుణ పదజాలంతో విమర్శిస్తూనే ఉన్నాడు. వీడికి ఏమైనా పోయేకాలం వచ్చిందో,ఏమిటో తెలియడం లేదు. ఈయన గారు నాపై విజయం సాధించానని ప్రగల్భాలు పలుకుతూ, కౌటిల్యుడికే పాఠాలు చెప్పగల స్టేజ్ నాదంటూ విర్రవీగుతున్నాడు. సాక్ష్యం మేగజైన్"లో మా కంటెంట్ రచయితలు వ్రాసిన శాస్త్ర బద్ధ విషయాలకు ఏనాడూ శాస్త్రపరంగా సిద్ధాంతానికి నిలబడకుండా పెద్ద,పెద్ద పిచ్చి టపాలు వ్రాసి, తనే చెత్త కామెంట్లు వ్రాసి సైకోలా ఆనందపడే నీకు మేము భయపడుతున్నామనుకున్నావా?

బ్లాగర్లకు అవమానం చేయడానికి అన్ని అడ్డమైన దారులు వెతుకున్నే నీవు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి అలజడులు రేపి మరింత ఆనందపదాలని చూస్తున్నావా? లేక నీహారికగారికి, నాకూ రాజకీయాల్లోకి వచ్చి మీపై అన్యాయంగా కేసులు బుక్ చేయించి ఇబ్బంది పెడతానని ఇన్ డైరెక్ట్ బెదిరింపా?

పిచ్చి పుల్లయ్యా? నీవిప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నావ్. ఆల్రెడీ మా ఫ్యామీలీలోనే పెద్ద,పెద్ద పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఎవడు బెదిరిపోతాడు మీ దిక్కుమాలిన బెదిరింపులకు?

నీవు నన్ను వ్యక్తిగతంగా ఎంత విమర్శిస్తున్నా సహిస్తూనే వస్తున్నా! నీ నైజం,నీగుణం ఏదోరోజు బయటపడుతుందిలే, నీ అహంకారం నిన్ను ముంచేసే రోజు వస్తుందిలే అని వదిలేసా! అవి నీకు దాపురించే కాలం దగ్గరైంది. ఆల్రెడీ Real indian పేరిట కొంతమంది నీకు మొగుళ్ళు తయారవ్వుతున్నారు. జాగ్రత్త పడు.


నీకసలు బుర్ర పనిచేస్తుందా? బ్లాగుల్లో యాడ్స్ పెట్టడం దేశద్రోహమా? మా అభిప్రాయాలు మేము వ్రాసుకోవడం నేరమా? ఏం వాగుతున్నావో నీకర్ధమవుతుందా? బ్లాగిల్లు శ్రీనివాస్ గారు తన వ్యాపార రహస్యాలు నాకు బోధించాడా? 10% ఆదాయం వస్తే చాలని నా గురించి అనుకున్నాడా? అదే నీవయితే కళ్ళకద్దుకునేవాడివా? ఇంతకీ ఆ వ్యాపార రహస్యం ఏమిటో తెలుసా? తమరు ఏ యాడ్స్ కోసం అయితే నాగురించి తెగ ఏడుస్తున్నావో అదే ఆ వ్యాపార రహస్యం. నీవు,ఎలాగూ ఆయనగారితో మెయిల్ కాంటాక్ట్ ఉందిగా? ఆ వ్యాపార రహస్యం తెలుసుకుని మీ బ్లాగులో కూడా యాడ్స్ పెట్టుకుని మీ రాజకీయ ప్రవేశానికి ఫండ్స్ సమకూర్చుకోండి.:) అయితే ఆవ్యాపార రహస్యం తెలుసుకోవడానికి నాకు ఫీజులు గుంజబడ్డాయి. మీకయితే అంతా ఫ్రీగానే చెప్తాడనుకుంటా?

వ్రాయాల్సింది చాలానే ఉంది. మళ్ళీ నా బిజినెస్ పనులలో ఖాళీ దొరికినప్పుడు వస్తాను.

పెద్ద గమనిక : నీవు,నీవు అన్నందుకు మీరెంత బాధ పడుతున్నారో అంతకంటే ఎక్కువ బాధ పడ్డాను నేను. బంతిని గోడకేసి ఎంత బలంగా కొడితే అంతకంటే బలంగా,వేగంగా మీ వైపుకే వస్తుంది. ఖబడ్దార్!

ఇకపోతే ఈ Real indian ఎవరో గాని మీ దుర్మార్గపు బుద్ధిని ,మీ వికృత నైజాన్ని ఒక్క కామెంట్ తో బయట పెట్టేసారు. ఆయనకు హాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నా!

శుక్రవారం, అక్టోబర్ 27, 2017

తెలంగాణా బ్లాగు మిత్రులందరికీ శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం DSC కి సంబంధించి G.O (గవర్నమెంట్ ఆర్డర్ )ను విడుదల చేసింది. వివరాలకు క్రింది లింక్ ద్వారా వెళ్ళవచ్చు.
TS DSC 2017 - Teachers Recruitment Test Rules - TS TRT Rules -GO.MS.25 Dt.110/10/2017

శనివారం, అక్టోబర్ 14, 2017

శోధిని బ్లాగులో వచ్చిన టపా పట్టుకుని బ్లాగిల్లు శ్రీనివాస్, హరిబాబుగార్లు పెడుతున్న కామెంట్లు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు.

శ్రీనివాస్ గారు.
మీరు నాకిచ్చిన రెండు ఫోన్ నంబర్లు స్విచ్చ్ ఆప్ చేసుకుని ఉన్నారు గనుక ఈ పోస్ట్ రూపంలో తెలియజేస్తున్నాను.
మీకూ,నాకూ స్నేహమా? అది కలుషితమయిపోయిందా? ఏo కామెంట్లు పెడుతున్నారో అర్ధం కావడం లేదా?

మీ దగ్గర కొన్ని బ్లాగులు బహుశా రెండు బ్లాగులు ఒకటి సాక్ష్యం మేగజైన్, రెండు ఈ బ్లాగునూ! అయితే ఈ బ్లాగు డిజైన్ పెద్దగా నచ్చక మళ్ళీ నేనే బ్లాగర్లోకి మార్చుకుని డిజైన్ చేసుకున్నా! వీటికి నేను మీకు డబ్బులిచ్చే చేయించుకున్నాను. ఇలా మీ నంబర్, నా నంబర్ తీసుకోవడం, అప్పుడప్పుడూ మాటలాడుకోవడం జరిగేది. అంతవరకే. అంతకు మించి మన విషయంలో ఇంకేముంది? నాకు నా ప్రాణమిత్రులతో కలవడమే సరిగా కుదరడం లేదు. మీతో కలుషితమయ్యి పోయేంత స్నేహ బంధాలే నడిచాయా? చాలా హాస్యాస్పదంగా ఉంది మీ వ్యవహారం. మీది రాజమండ్రి, మాది కాకినాడ. వేట్లపాలెంలోని మా మావయ్య గారి బoక్ లో ఎక్కువుగా ఉంటాను కూడా. మీకు చాలా దగ్గరలో అయినా ఏనాడు మిమ్మల్ని కలవనే లేదు. మీరు చెపుతున్నంత స్నేహం మన మధ్య ఉంటే మనం కలవకుండా ఉంటామా? మీరు కల్సే ప్రయత్నం చేసానని చెప్పవచ్చు. అయితే మీతో ప్రత్యేకంగా కలిచేoత అవసరం, స్నేహభావం మనమధ్య లేవు. మీరు గతంలో కొంతమంది బ్లాగర్ల విషయంలో మీరు రికార్డ్ చేసిన ఫోన్స్ నాకు మెయిల్ ద్వారా వినిపించినప్పుడే మీకు ఫోన్స్ రికార్డ్ చేసే భయకరమైన గుణం ఉందని గుర్తించి ఉంటే ఆరోజు నుండే అప్పుడప్పుడూ మీరు కాల్ చేస్తూ నాతో మాట్లాడే విధానానికి స్వస్తి చెప్పేసే వాడిని.మీరు ఆదుకునేoత  దౌర్భాగ్యపు స్థితిలో నేను లేను.ఇటువంటి అసంబద్ధమైన వ్యాఖ్యలు కలిపించకండి.

గతంలో మీరు వివిధ ఐడిలతోనూ, బ్లాగులతోనూ పల్లా కొండల రావుగారి అగ్రిగేటర్ విషయంలో చేసిన దాడి నాకింకా గుర్తుంది. గతంలో నా బ్లాగులలో కూడా మీరు వివిధ ఐడిలతో కామెంట్ చేసేవారు కదా? ఆ విషయాలు నాతో కూడా పంచుకునేవారు కదా? మీరు అప్పుడప్పుడూ కావాలని చేసే వైరల్ దృష్టిలో పెట్టుకుని మీకు ఫోన్ కూడా చేసాను. కాని మీరు మాట్లాడిన తీరు చూస్తే మీరేనన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది. అయితే ఫోన్స్ రికార్డ్ చేసే నికృష్టపు అలవాటు నాకు లేదు కాబట్టి నేను రికార్డ్ చేయలేదు.

ఏమో నా అభిప్రాయం నిజం కావచ్చు. పొరపాటు కావచ్చు.నిజానికి వేరే బ్లాగులో వచ్చిన ఆ అజ్ఞాత కామెంట్ గురించి పట్టించుకోవడం అనవసరమనిపించిoది.

కాబట్టి నాగురించి మీరు చేస్తున్నది ఇక్కడితో ఆపు చేసేయండి. బాగుండదు. మీరు శోధినిలో టపా వేసినప్పుడే ఈ క్రింది కామెంట్ పెట్టాను. ఎవరివలన జరిగిందో ఎందుకు జరిగిందో, కావాలని జరిగిందో, తెలియదు గాని ఈ విషయాన్ని అనవసరం అన్న ఉద్దేశ్యంతో ఈ కామెంట్ పెట్టాను.
దానికి మీరు క్రింది విధంగా స్పందించి సరే సార్ అన్నారు.
మీకు కామెంట్ పెట్టి తీసేయడం అలవాటు కాబట్టి యధాప్రకారం ఆ కామెంట్ మీ బ్లాగునుండి తొలగించి వేసారు.అయితే మాలికలో స్టోరేజ్ అయ్యే ఉంది.

మీ సమాధానంలో సరే సార్..ఈ పోస్ట్ఉద్దేశ్యం వేరని చెప్పిన మీరు నాపై వ్యక్తిగత దూషణలకు ఎందుకు తీసుకు వెళ్తున్నారు? ఇక ఆపేయండి.మీకే మంచిది. మీకు నావలన ఇబ్బంది కలిగితే ఫోన్ చేయండి.మీరు రెండు రోజులనుండి ఫోన్ స్విచ్చ్ ఆప్ చేసుకుని ఉండాల్సిన పని లేదు. ఆన్ చేసుకోండి. నాకు ఫోన్ చేయండి.

ఇక హరిబాబు గారూ!
ఏమిటి మీ వ్యక్తిగత దూషణలు. ఎవడి అభిప్రాయాలు వాడు వ్రాసుకుంటాడు. నచ్చితే మా బ్లాగ్ చదవండి, లేకపోతే మానేయండి. వెధవ్వ , సన్నాసి, పిచ్చి పుల్లయ్య, సైకో, అక్కడ కలిపేస్తా, ఇక్కడ కలిపేస్తా? ఏమిటి సర్ ఈ వాగుడు? మా కీబోర్డులో బటన్స్ లేవనుకుంటున్నారా? మీ వయస్సుకు గౌరవాన్ని ఇవ్వకుండా ఉండలేకపోతున్నాము. అలాగే మా సంస్కారాన్ని వదిలి పెట్టలేము. నా పట్ల మా మేగజైన్ కంటెంట్ రచయితల పట్ల వ్యక్తిగత దూషణలు, సభ్యత దిగజారి మాట్లాడటం మానుకోండి. మా మేగజైన్ రచయితలు మీకంటే కూడా వయస్సులో పెద్దవారు ఉన్నారు. గౌరవంగా ప్రవర్తించడం నేర్చుకోండి. మీకంటే వయస్సులో చిన్న వాడినైన నేను మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదనుకుంటాను. మీ అభిప్రాయాలు నాకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. నచ్చలేదని మీతో ఏనాడైనా దూషణలు చేస్తూ కామెంట్ పెట్టానా? లేదే.

మా మేగజైన్ గాని, బ్లాగులు గాని నచ్చకపోతే మానివేయండి. అంతే. మీరు చూడాలని రూలేమైనా ఉందా?

ఇక ఉంటాను. నాకు మీ ఇద్దరి ప్రవర్తన పట్లా కలిగిన బాధతో వ్రాసాను. ఇంకా ముఖ్యమైన, ప్రధానమైన విషయాలు ఉన్నప్పటికీ కొద్దివరకే వ్రాసాను. ఇలా  వ్రాయడమే నాకు చిరాక్ కలిగిస్తోంది. శుభం.

శుక్రవారం, అక్టోబర్ 13, 2017

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అలానే ఉంది. ఒక బ్లాగరుపై మరొక బ్లాగరు విరుచుకుపడే స్థాయికి దిగజారిపోయారు. అజ్ఞాత రూపంలో కామెంట్లు పెడుతూ బ్లాగర్ల మధ్య విరోధ,విద్వేషాలు రగిలించే సన్నాసి వెధవలు పెరిగిపోతున్నారు. దీనిని అరికట్టాల్సిన కొంతమంది బ్లాగర్లు, అగ్రిగేటర్లు వారిని ప్రోత్సాహిస్తూ మరింతగా ముందుకు నడిపిస్తున్నారు. ఇటువంటివారు ముమ్మాటికీ శిక్షాహరులే. ఎవరైనా అజ్ఞాత కామెంట్ల వలన బాధపడి యుంటే వీరిని ప్రోత్సాహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడాల్సిన పని లేదు.

ముందుగా మాలిక,శోధిని లాంటి ప్రధాన అగ్రిగేటర్లు జాగ్రత్త తీసుకోవాల్సిందే. అటువంటి కామెంట్ల సెక్షన్ ని మూసివేయాల్సిందే. ఈ పని చేయలేనప్పుడు అగ్రిగేడర్లను మూసుకునికూర్చోడం మంచింది.

మన బ్లాగర్లు దయచేసి మీ బ్లాగుల యొక్క అజ్ఞాత కామెంట్ల సెక్షన్ ని డిసేబుల్ చేసేయండి. బ్లాగర్ల మధ్య ప్రశాంతమైన వాతావరణాన్ని కలిపించండి. ఎవరి అభిప్రాయాలు వారు వ్రాసుకుంటారు. నచ్చితే మెచ్చుకుంటాము. నచ్చకపోతే, ఆ అభిప్రాయంలోని లోపాలను ఎత్తి చూపుతాము. లేకపోతే మన బ్లాగులో మరొక పోస్టు వ్రాస్తాము. అంతేగాని వార్నింగ్లు, అవహేళనలు చేస్తే అవతలివారు కూడా అదే స్థాయిలో స్పందిస్తారు. ఇటువంటి పరిస్థితిని క్రియేట్ చేసుకోవడం ఎందుకు? ఎంతోమంది మంచి బ్లాగర్లు మనస్థాపం చెంది వెళ్ళిపోయారు, వెళ్ళిపోతున్నారు.

ఇకనుండైనా ఆ పరిస్థితిని మనం మార్చుదాం. దీనికి మీరేమంటారు?

మంగళవారం, అక్టోబర్ 10, 2017

Why is the fires on Kancha Ilaiah?
"సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్ళు" పుస్తక రచయిత కంచె ఐలయ్యపై ఇటీవల మన ఆర్య వైశ్యులు విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆయన బొమ్మలను తగుల బెట్టడం, పుస్తకాలను కాల్చడం, విపరీత పదజాలంతో దుర్భాషాలడటం జరగడంతో పాటు రాష్ట్ర మంత్రి అయ్యుండి టి.జి.వెంకటేష్ గారు "కంచె ఐలయ్యను నడిరోడ్డుపై ఉరి తీయాలి, కొట్టి చంపాలి " లాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు.

ఇంతకీ కంచె ఐలయ్య చేసిన తప్పేమిటి? ఆయనపై అంతగా విరుచుకు పడడానికి గల కారణం ఏమిటి? అని ఆలోచిస్తే మా కులాన్ని ఆయన విమర్శించాడు. మమ్మలను స్మగ్లర్లు అన్నాడన్నదే! అసలు కంచె ఐలయ్య ఆ పుస్తకం వ్రాయాల్సిన అవసరం ఉందా?

నిజానికి ఈ కాలంలో వ్యాపారాలు కోమటోళ్ళు మాత్రమే చేయడం లేదు. అన్ని కులాలవారు చేస్తున్నారు. చిన్నా, పెద్దా వ్యాపారస్తులు అన్ని కులాలలోనూ ఉన్నారు. కేవలం కోమటోళ్ళును మాత్రమే టార్గెట్ చేయడమన్నది అన్యాయమే అవుతుంది. నిజానికి నేటి రాజకీయ నాయకులను మించిన సామాజిక స్మగ్లర్లు ఎవరుంటారు..చెప్పండి?

కంచె ఐలయ్య వ్రాసిన "సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్ళు" అనే పుస్తకం ఈకాలానికి ఏమాత్రం సంబంధించింది కాదు. ఎందుకంటే కోమటోళ్ళు మాత్రమే వ్యాపారరంగంలో లేరుగా? అలా కాకుండా "సామాజిక స్మగ్లర్లు - వ్యాపారస్తులు" అని టైటిల్ పెడితే కరెక్ట్ గా ఈకాలానికి సరిపోతుంది.

అయితే ఇంతకీ "సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్ళు" అనే ఈ పుస్తకం ఏ కాలానికి సరిపోతుంది?

నా దృష్టిలో ఈ పుస్తకం 20సంవత్సరాలనుండి ౩౦సంవత్సరాల క్రితం కాలానికైతే కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే ఆయా కాలాలలో అత్యధిక వ్యాపారం కోమటోళ్ళ చేతుల్లోనే ఉండేది. గ్రామాలలో,పల్లెలలో పేద ప్రజలను అన్యాయంగానే దోచుకుతినేవారు. చిన్న కిరాణా దుకాణం పెట్టి వేలకు వేలు సంపాదించేవారు. నాసిరకం వస్తువులను అంటగట్టడంలోనూ, తూనికల్లో మోసాలు చేయడంలోనూ వీరిని మించినవారు ఎవరూ ఉండేవారు కాదు. ఇప్పటికీ గ్రామాలలోనూ, పల్లెలలోనూ ఈ విధానం ఏమాత్రం సమసి పోలేదు. కొనసాగుతూనే ఉంది. గ్రామాల,పల్లెల అవగాహన, నివాసన చేసినవారు కాదనలేని పచ్చి నిజం ఇది.

ఇక కంచె ఐలయ్య విషయానికి వస్తే ఈయనగారు లక్షకోట్లు ఇస్తే అందరిచేత బైబిల్ పట్టిస్తాను. క్రైస్తవ మతాన్ని స్థాపిస్తాను అనే ఉద్దేశ్యం గనుక నిజమైతే కంచె ఐలయ్యను తీవ్రంగా పరిగణించవల్సిందే. ఎందుకంటే భారత దేశంలో నేటి క్రైస్తవ్యం ఎప్పుడైతే వ్యాపించబడుతుందో అప్పడే నైతికత నాశనమవ్వడం ఖాయం. ఎందుకంటే యేసు యొక్క ఒరిజినల్ బోధనలు గాని, విశ్వాసాలు గాని నేటి క్రైస్తవంలో ఏకోశానా లేవు.

ఇకపోతే కంచె ఐలయ్యకు సంబంధించిన కులాల వివాద వ్యవహారంలో మత స్వామీజీలు దూరటం విడ్డూరంగానే ఉంది.

ఆదివారం, అక్టోబర్ 08, 2017

జిలేబమ్మ ఎవరో తెలీదు గాని ప్రతి బ్లాగులోకి వచ్చి కామెంట్ పడేస్తుంది. అలా చేయడం మంచిదే గాని ఆ కామెంటేదో అర్ధమయ్యేలా పెడితే బాగుణ్ణు. తెలుగు బాషను కూనీ చేసే పదాలతో ఊదరగొడుతుంది. ఒత్తులు సైతం తప్పు రాస్తే బూతద్ధంతో సైతం వెతికి పట్టుకునే మన శ్యామలీయం మాష్టారు మన జిలేబమ్మను ఎందుకు వదిలి వేసారో కూడా అర్ధం కావడం లేదు. ఇక మన జిలేబమ్మ కామెంట్లను గమనిస్తే బ్లాగర్ల మధ్య, కామెంట్ల మధ్య వైరం ఏర్పాటు చేస్తుంది. వివాదం మరింత ముదిరేలా చేస్తుంది. మరికొన్ని సందర్భాలలో అత్యంత హాస్యాన్ని కూడా కురిపిస్తుంది. ఇంతకీ ఈ జిలేబమ్మ ఎవరో, ఏమిటో నాకు అర్ధమవ్వలేదు. తెలియజేయగలరా?

శుక్రవారం, అక్టోబర్ 06, 2017

 


Recent Posts