శనివారం, నవంబర్ 18, 2017

Why did Mahatma Gandhi not get the Nobel Prize?
గాంధీకి నోబెల్‌ బహుమతి ఎందుకు ఇవ్వలేదు. నిజానికి ఇది ప్రపంచంలోని అనేకులకు వచ్చే ఒక సందేహం. 1937, 1938, 1939, 1947 సంవత్సరాలలో మహాత్మా గాంధీ పేరు నోబెల్‌ శాంతి బహుమతి కోసం ప్రతిపాదించడం జరిగింది. 1937లోను, అటు తరువాత కొంతకాలం పాటు ఆయన అనుచరులకే అర్థం కాని ఆయన సిద్ధాంతాలున్నాయని నోబెల్‌ కమిటీవారు ఆయన పేరును తుది జాబితాలో చేర్చలేదు. 1947లో పాకిస్తాన్‌ ఏర్పాటు విషయంలో వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయనకు అవార్డు ఇవ్వకూడదని కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1948లో నోబెల్‌ శాంతి బహుమతి కోసం మహాత్మా గాంధీని ఎంపిక చేశారు. అయితే ఆయన ఆ సంవత్సరం జనవరి 30వ తేదీన తుపాకీ గుండ్లకు బలి అయ్యారు. అప్పట్లో ఉన్న నియమం ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే మరణించిన వ్యక్తులకు నోబెల్‌ బహుమతులు ప్రకటించాలనేది నిబంధన. గాంధీ ఒక సంస్థకు ప్రతినిధి కాదు. మరణ విల్లును ఆయన వ్రాయలేదు. బహుమతి ఎవరికి అందజేయాలో నోబెల్‌ సంస్థకు తెలియకపోవడంతో ప్రతిపాదన విరమించుకోబడింది. ఇక అర్హులు ఎవ్వరూ లేకపోవడంతో ఆ సంవత్సరం నోబెల్‌ శాంతి బహుమతి ఎవ్వరికీ ఇవ్వలేదు. అంతేగాని కొందరు ఊహించినట్లుగా ఆయన బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ఉద్యమం నడపటం వలన, తెల్లవారికి వ్యతిరేకంగా, నల్ల వారి తరపున ఉద్యమాలకు నాయకత్వం వహించటం వలనే మహాత్మా గాంధీకి నోబెల్‌ బహుమతి ఇవ్వలేదనే వాదం సరియైనది కాదు. ఇలా ఈ బహుమతుల మీద ఎన్నో ప్రశంస లు, ఎన్నో విమర్శలు ఉన్నాయి.

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts