బుధవారం, డిసెంబర్ 09, 2015

మా ప్రసాద్ గాడికి ఏమి జరిగిందో చెప్పేముందు మీకు వాడి గురించి తెలియాల్సిన అవసరం వుంది. ఎందుకంటే వాడిని బుక్ చేసింది నేనే కాబట్టి మీరందరూ నన్ను తిట్టుకునే అవకాశం ఉంది. సరే...మా ప్రసాద్ గాడు డైలీ చేసే పెద్ద పని ఏమిటంటే ఎప్పుడూ మొబైల్ లో సొల్లు కబుర్లు చెప్పడమే! ఏదో ఒక రాంగ్ నంబర్ కి డయల్ చేయడం అవతలి వాళ్ళు మగవారైతే రాంగ్ నంబర్ సర్ అని చెప్పి పెట్టేయడం, ఆడ వారైతే ఏదో విధంగా మాటలు కలుపుకుని మాటలాడటం వీడి ప్రధాన పని, ఈ విషయంలో ఎన్నో తిట్ల పురాణాలు వీడు స్వతహాగా అనుభవించిన  బుద్ది రాలేదు. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ గారు పనీపాటా లేకుండా వీడు జులాయిగా తిరుగుతున్నాడని నా దగ్గర ఎన్నోసార్లు వాపోయింది.
    అందుకనే వీడి తిక్క ఎలాగైనా కుదిరించాలని అతనికి వీడి నంబర్ ఇవ్వడం జరిగింది.
    మా ప్రసాద్ గాడికి ఒకరోజు అనుకున్నట్టే రాజమండ్రి నుండి కాల్ వచ్చింది.
   వాడికిక తీరిక లేకుండా పోయింది. బెడ్ రూమ్ లోనూ, బాత్రూమ్ లోనూ, ఇంటా,బయటా ఎక్కడ చూసినా ఫోన్ తోనే కాలక్షేపణ .వాడికి ప్రతి రోజూ బిజీ,బిజీ. వాడి వాలకం చూసి నాకర్ధమయ్యిపోయింది.
  ఒకరోజు నేనే అడిగాను. ఎక్కడ నుండి ఫోన్?
 "రాజమండ్రి నుండి" వాడి సమాధానం. నవ్వి హూరుకున్నాను.
  "నేను ఎంతో మంది అమ్మాయిలతో మాట్లాడాను. కానీ ఈ అమ్మాయెవరో చాలా బాగా మాటలాడుతుంది. వాయిస్ గానకోకిలనుకో! ఎలాగైనా ఈ అమ్మాయిని నా భార్య గా చేసుకోవాలి, నాకసలు నిద్రపట్టడం లేదు. తిన్నా, పడుకున్నా ఆమె గురించే ఆలోచనలు" వాడు ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతుంటే నాకొచ్చే నవ్వును ఆపుకోవడానికి చాలా కష్టమయ్యింది.
  ఎప్పుడు కలుస్తున్నావ్?
త్వరలో ... ఇదీ వాడితో జరిగింది. ఇంతకీ వాడు వారం తరువాత నా దగ్గరికి పరుగున వచ్చి ఆయాసంతో ప్రక్కన కూలబడ్డాడు " ఏమైంది? ఆదుర్దాగా అడిగాను.
 "రాజమండ్రి నుండి నాకొచ్చే కాల్ అమ్మాయిది కాదు. అబ్బాయిది." ఆ సమయంలో వాడి ముఖకవళికలు చూస్తుంటే...నేను నవ్వును ఆపుకోలేకపోయాను.
ఇంతకీ మా ప్రసాదిగాడికి అమ్మాయి కాదు..అబ్బాయని ఎలా తెల్సింది?

Related Posts:

  • జీవితానికి అడ్జస్ట్ మెంట్ కావాలి! జీవితంలో పైకి రావాలంటే ప్రతిభా,పనితనం మాత్రమే సరిపోవు.ఎప్పటికప్పుడు ఎమోషన్స్ ని అదుపు చేసుకుపోతూ అడ్జస్ట్ మెంట్ అలవాటు చేసుకోవాలి. ఇటువంటి విషయాలు చెప్పడానికి,రాయడానికి బావుంటాయని అనుకోకండి.అక్షరాలా అద్భుతాలు చేసినవారెందరో … Read More
  • ఫేక్ న్యూస్ లపై గూగుల్ యుద్ధం... | Google War on Fake News ... ఫేక్ న్యూస్ లపై గూగుల్ యుద్ధం... | Google War on Fake News ... ప్రస్తుతం సమచార వెల్లువ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం - పుట్టలు పుట్టలుగా పుట్టుకొస్తున్న వెబ్ సైట్లు - బ్లాగ్ ల వల్ల తప్పుడు వ… Read More
  • అన్ని వ్యవహారాలు నమ్మకం మీదే ఆధారపడి నడుస్తాయి. 100% నిజమని నమ్ముతున్నాను. ఎందుకంటే నమ్మకం లేనిది ఏదీ లేదు. మనిషి నైనా, గవర్నమెంట్ వ్యవస్థనైనా ఆఖరికి దేవుడినైనా నమ్మకంతోనే చూస్తూన్నాము. నమ్మకంతోనే బ్రతుకుతున్నాము. రేపటి కోసం చూస్తున్నామంటే రేపటికి మనము బ్రతికే ఉంటామన్న నమ… Read More

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Recent Posts

 ప్రళయం రాబోతుందా? Whats Wrong In Oceans? | Doomsday Fish Oarfishసముద్రం 3k లోపల ఉండే ఈ చేప...
 America is sending our Indians back! | మన భారతీయులను వెనక్కి పంపేస్తున్న అమెరికా!America is...
 ప్రతిరోజూ ఈ లేడీ అఘోరా గొడవేంటి? | Lady Aghora | KSC Smart Guideప్రతిరోజూ ఈ లేడీ అఘోరా...
 Nara Chandrababu Naidu is a living example of patience | సహనానికి నిలువెత్తు నిదర్శనం నారా...
 ఈమధ్య Youtubeలో వచ్చే రాజకీయ ఫేక్ వీడియోలు చూస్తుంటే చాలా బాధేస్తుంది.రాజకీయాలకు బానిసయ్యి...